దేశంలో నకిలీ నోట్ల దందా బాగా పెరిగిపోతోంది. ఇదేదో విపక్షాల ఆరోపణ కాదు.. ఏకంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్
ఇండియా తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికే ఈ విషయాన్ని చెబుతోంది. ఈ ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. అన్ని డినామినేషన్ల నకిలీ నోట్లు బాగా పెరిగాయి. ప్రధానంగా రూ.500 నకిలీ నోట్లు 101.9 శాతం పెరిగాయట. రూ.2,000 ఫేక్ నోట్లు 54.16 శాతం ఎక్కువయ్యాయట. ఒక్క రూ.50, రూ.100 నోట్లు తప్ప మిగిలిన అన్ని నకిలీ నోట్లు బాగా పెరిగిపోయినట్టు ఆర్‌బీఐ తాజా నివేదిక చెబుతోంది. దేశంలో నగదు చలామణి కూడా మూడేళ్లలో 28.28 శాతం పెరిగిందట. అన్ని డినామినేషన్లు కలిపి రెండేళ్ల క్రితం రూ.24,20,975 కోట్ల విలువైన బ్యాంకు నోట్లు చలామణిలో ఉన్నాయి. ఏడాది క్రితం ఈ విలువ రూ.28,26,863 కోట్లకు పెరిగితే.. తాజాగా 2022 నాటికి ఈ విలువ రూ.31,05,721 కోట్లకు చేరుకుంది.