తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. వెంకన్నను దర్శించుకోవాలని తపించని భక్తుడు ఉండడు.. కొందరైతే ఏడాదికి ఓసారన్నా దర్శనం చేసుకుంటారు. ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటి అంటారా.. ఇకపై తిరుపతి రైల్వే స్టేషన్ను అద్భుతంగా తీర్చి దిద్దబోతున్నారట. ప్రయాణికుల అన్ని రకాల అవసరాలను తీర్చేలా, భవిష్యత్తు అవసరాల మేరకు తిరుపతి రైల్వే స్టేషన్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి పరచడానికి జోన్ నిబద్దతతో కట్టుబడి ఉందని దక్షిణ మధ్య రైల్వే ఇంచార్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అంటున్నారు.
ఈ అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టి నిర్ధేశించి సమయంలోగా పూర్తి చేస్తామంటున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక తిరుపతి రైల్వే స్టేషన్ సుందరంగా ఆకర్షణీయంగా ఉంటుందని ఆయన అభిప్రాయ పడుతున్నారు. ప్రాముఖ్యమైన స్టేషన్లో రైలు ప్రయాణికుల ఆక్షాంక్ష మేరకు వసతులు అందుబాటులో ఉంటాయని జైన్ అభిప్రాయపడ్డారు.