ఏపీ మంత్రికి అస్వస్థత.. ఫోన్‌ చేసిన జగన్‌?

Chakravarthi Kalyan
ఏపీ మంత్రి ఒకరు అస్వస్థతకు గురయ్యారు. ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో  పాల్గొన్న మంత్రి సురేష్.. ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇబ్బందిగా ఉండటంతో  వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల్లో ఇబ్బంది ఉందని తేలడంతో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. యాంజియోప్లాస్టి చేసి ఊరట కలిగించారు.

మంత్రి సురేష్ అస్వస్థత విషయం తెలిసిన సీఎం జగన్.. ఆయనతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని సీఎం జగన్ ఆయనకు సూచించారు. ఆదిమూలపు సురేష్ జగన్ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం పురపాలక శాఖను చూస్తున్నారు. గతంలో ఆదిమూలపు సురేష్ జగన్‌ కేబినెట్‌లో ఉన్నారు. అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: