ఉక్రెయిన్: యుద్ధం జరుగుతున్నా థియేటర్లు ఫుల్!
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జన జీవనం సాధారణ స్థితికి చేరుతోంది. క్రమంగా సినిమా థియేటర్లు, నేషనల్ ఒపేరా వంటి ప్రదర్శనశాలలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. కీవ్ లోని పొదిల్‌లో నిన్న ఓ థియేటర్ కూడా ప్రదర్శన ప్రారంభించారు. యుద్ధం సమయంలో జనం వస్తారా రారా అని థియేటర్ యజమానులు కాస్త ఆందోళన చెందారట. కానీ.. మొదటి రోజే అన్ని టికెట్లు అమ్ముడుపోవడంతో వారు ఆనందభరితులయ్యారు.