ఉల్లిని ఆహారంలో తీసుకోవడం కేవలం ఆరోగ్యమే కాదు.. అందం కోసం కూడా. ఎలాగంటే.. తెల్ల ఉల్లిపాయలు జుట్టు పెరుగుదలకు, చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్, తెల్ల ఉల్లిరసాన్ని కలిపి వాడితే చాలా మంచిది. అలాగే ఉల్లి గుజ్జు ముఖానికి పట్టిస్తే మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా రోజూ ఒక పచ్చి ఉల్లిపాయ తింటే అధిక కొవ్వును అతి తక్కువ కాలంలో తగ్గించవచ్చు. పొట్టనిండా విటమిన్లు నింపుకున్న ఉల్లిపాయను పచ్చిగా తిన్నా మంచిదే.. అలాగే వంటల్లో వాడినా మంచిదే.. క్రమం తప్పకుండా తింటే ఉల్లి వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఉల్లి విలువను గుర్తించండి.. మీ వంటల్లో విరివిగా వాడండి. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత వచ్చింది. ఇలా ఉల్లి వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉల్లిపాయ లేని కూరలేమైనా చెప్పాలంటే కూడా కష్టమే కదా. అందుకే ప్రతి కూరలోనూ ఖచ్చితంగా ఉల్లి వాడతుంటారు.