బాబోయ్‌.. కనిపించకుండానే హడలెత్తిస్తున్న పులి?

Chakravarthi Kalyan
కాకినాడ జిల్లాలో పులి ఇంకా ఆ జిల్లా వాసులకు కొన్ని ప్రాంతాల్లో కంటిపైన కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని రోజుల క్రితం చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. వారం రోజుల క్రితం రోజుకో పశువుపై పంజా విసిరి ఈ పులి అందరినీ భయపెట్టేసింది. జిల్లా వాసుల విజ్ఞప్తితో అటవీశాఖ వారు కూడా పులిని పట్టుకునేందుకు చాలా ప్రయత్నించారు. ఓ బోను ఏర్పాటు చేసి.. అందులో ఓ దున్నను కూడా ఉంచి మరీ ఎర వేశారు.


కానీ ఆ తెలివైన పులి.. అది పసిగట్టిందో ఏమో.. ఆ దున్న జోలికి వెళ్లకుండా వెనుతిరిగింది. ఆ తర్వాత పులి అడవిలోకి వెళ్లిపోతోంది.. ఇక భయం లేదని అటవీశాఖ అధికారులు చెప్పారు. కానీ ఇంత వరకూ మళ్లీ ఆ పులి జాడ కనిపించడం లేదు. ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లో పులి ఆనవాళ్లు తాజాగా ఏమీ కనిపించడం లేదు. అయితే.. పులి వజ్రకూటం, కత్తిపూడి, పోతులూరు, కొడవలి కొండల్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. పులి ఆనవాళ్లు దొరక్క అటవీ బృందాలు కూడా వెనుదిరుగుతున్నాయి. కొన్నిరోజులుగా పులి వేటాడం లేదు. కెమేరాలకూ చిక్కడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: