ప్రాణాలతో వదలను.. రాజాసింగ్‌ హెచ్చరిక?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటారు.. హిందూ అనుకూల భావజాలం ప్రదర్శంచే ఈ ఎమ్మెల్యే మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఎందుకంటే.. చాలా రోజుల నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. అయితే.. సాధారణంగా ఇలాంటి కాల్స్ వస్తే ఏం చేస్తారు.. సమీప పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ ఇస్తారు.

మాకు ఇలాంటి కాల్స్ వస్తున్నాయి.. మాకు రక్షణ కల్పించండి అని ఉత్తరం రాస్తారు.. కానీ.. రాజాసింగ్‌ డిఫరెంట్ కదా. ఆయన కూడా మంగల్‌హాట్‌ పోలీసులకు బెదిరింపు కాల్స్ పై ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ ఫిర్యాదులో ఆయన రక్షణ కోరలేదు. అంతే కాదు.. నాకు రక్షణ అవసరం లేదు.. కానీ.. ఎవరైనా తన జోలికి వస్తే.. వాళ్లను ప్రాణాలతో వదలను.. అని ఏకంగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనే రాయడం విశేషం. తనకు చాలా రోజుల నుండి నాకు కొన్ని ఫోన్ నంబర్లు +447424643878 , +447471183563 నుంచి మళ్లీ బెదిరింపు కాల్‌లు వస్తున్నాయట. కానీ.. ఇలా నేరుగా పోలీసులతో నా జోలికి వస్తే చంపేస్తానని రాయడం మాత్రం విచిత్రమే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: