శ్రీలంక: పెట్రోల్ కోసం క్యూలో.. 10 మంది మృతి
ఇప్పటి వరకూ ఇలా శ్రీలంకలో పెట్రోల్ బంకుల వద్ద క్యూలో నిల్చుని పది వరకూ చనిపోయినట్టు శ్రీలంక మీడియా ద్వారా తెలుస్తోంది. వాహనంలో ఇంధనం నింపుకునేందుకు ఓ 63ఏళ్ల వృద్ధుడు ఐదురోజులపాటు ఎదురు చూసి.. చివరకు తన వాహనంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఇంధనం కోసం క్యూలో మరణించడం ఇదో పదో సంఘటన అని అక్కడి మీడియా చెబుతోంది. ఇలా చనిపోయిన వాళ్లంతా 40 నుంచి 80ఏళ్ల మధ్య వారు కావడం విశేషం.