మోదీ సభ: వంటలమ్మ యాదమ్మకు అవమానం?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు మోదీ హాజరైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ బీజేపీ పెద్దలకు తెలంగాణ వంటకాలు పరిచయం చేసేందుకు ప్రత్యేకంగా యాదమ్మ అనే వంట బృందాన్ని రప్పించారు. అయితే.. యాదమ్మ బృందాన్ని నోవాటెల్ హోటల్‌లోకి అనుమతించలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
అయితే.. తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని యాదమ్మ ఖండించారు. కొందరు కావాలని ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆమె బాధపడ్డారు. తనను నోవాటేల్ లోకి రానివ్వలేదని కొందరు మూర్ఖులు దుష్ప్రచారం చేశారని యాదమ్మ మండిపడ్డారు. కొందరు సోషల్ మీడియా యువకులు కింద కూర్చోమని చెప్పి ఫోటో తీశారని, తనకు వాళ్ళ దుర్బుద్ధి అర్థం కాలేదని యాదమ్మ చెప్పారు.

తాను నోవాటేల్ దగ్గరకు రాగానే బండి సంజయ్ గారు కారు పంపి తనను వెంటనే లోపలికి తీసికెళ్లి గొప్పగా చూసుకున్నారని ఆమె అన్నారు.  లోపలికి వెళ్ళగానే మోడీ గారితో కలిసి భోజనం చేసి అవకాశం దక్కడం జీవితం లో మరిచిపోలేనని యాదమ్మ అన్నారు. ప్రధాని సహా  దేశం లోని మహా మహులకు వండి పెట్ట అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని యాదమ్మ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: