తెలంగాణ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్?
ఇప్పుడు తెలంగాణ సర్కారు ఈ గురుకుల పాఠశాలల సంఖ్య పెంచుతోంది. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గురుకుల డిగ్రీ కళాశాలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మరో 33 బీసీ గురుకుల పాఠశాలలు, మరో 15 బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలు ఏర్పడబోతున్నాయన్నమాట.