తండ్రి ఐఏఎస్.. పిల్లలు గవర్నమెంట్ స్కూల్?
ఇప్పుడు ఏపీలోని పాఠశాలల్లో అన్ని తరగతుల్లోనూ ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు. అందుకే.. విజయవాడ పటమటలోని బసవపున్నయ్య జడ్పీ హైస్కూల్ లో తన పిల్లలను చేర్పించారు . ప్రభాకర్ రెడ్డి కుమార్తె 8 వ తరగతి కాగా.. కుమారుడు 6వ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం హైస్కూల్ లో ఆంగ్ల మాథ్యమంలో విద్యాబోధన ఉండటం వల్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపినట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో తరగతి గదులు, వసతులు బాగున్నాయని మెచ్చుకున్నారు.