ఆ రెండు రోజులు హైదరాబాద్‌లో సందడే సందడి?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌కు బోనాల్‌ కళ వచ్చింది. ఆదివారాలు ఈ సందడి మరింతగా ఉంటుంది. ఈ నెల 17, 24 తేదీల్లో జరగనున్న బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఉత్సవ కమిటీ సభ్యులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు బోనాలు నిర్వహించుకోలేక పోయామన్నమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈ నెల 17న సికింద్రాబాద్ మహంకాళి, 24న ఓల్డ్ సిటీ బోనాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.


ఈనెల 18 న మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25 న  ఉమ్మడి దేవాలయాల  అంబారీ ఊరేగింపు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రధాన దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని.. చార్మినార్ వద్ద 500 మంది కళాకారులతో కళాప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని  తలసాని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు సిబ్బంది ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: