జగన్ ఓటమి కోసం పులివెందుల పబ్లిక్‌ వెయిటింగ్‌?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డిని పులివెందులలో ఓడించేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అమర్ నాథ్ యాత్రలో రాష్ట్ర ప్రజలు గల్లంతైతే ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మోటార్లకు మీటర్లు కేంద్రం ఉపసంహరించుకుందన్న దానిపై జగన్ రెడ్డి వైఖరి సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ తరుపున చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు.

మద్యనిషేధం, సీపీఎస్, అమరావతిపై మాట తప్పి మడమతిప్పడం జగన్‌రెడ్డి విశ్వసనీయతా  తెలుగుదేశం అధినేత  చంద్రబాబు అని నిలదీశారు. చిన్నాన్నపై గొడ్డలివేటు వేసిన నేరస్థుల్ని కాపాడటం విశ్వసనీయతా అని మండిపడ్డారు. జగన్ ఓటమి భయంతోనే తెదేపా అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తుందని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి కన్నా తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేసిందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: