ఆ సర్వే ఫలితాలు.. రేవంత్ రెడ్డికి బిగ్‌ షాక్‌..?

Chakravarthi Kalyan
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆరా సంస్థ సర్వే ఫలితాలు బిగ్ షాక్‌ ఇచ్చాయి. తెలంగాణలో పోటీ అంటే.. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ అనే ఎవరైనా భావిస్తారు.. కానీ.. ఈ సంస్థ ఇచ్చిన సర్వే ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్  మస్తాన్ వెల్లడించిన వివరాలు ప్రకారం..  తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోతుందట.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే ఆధిక్యం లభిస్తుందట. ఇక బీజేపీ 30.48 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలుస్తుందట. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 23.71 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలుస్తుందట. ఈ సర్వే ఫలితాలు రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తున్నాయని చెప్పకతప్పదు.. బీజేపీ బాగా పుంజుకోవడం.. కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించడం రేవంత్‌ రెడ్డికి షాకింగ్ అని చెప్పక తప్పదు. మరి కాంగ్రెస్ ఈ సర్వేపై ఎలా స్పందిస్తుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: