కొన్ని వార్తలు భలే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒకరికి తెలియకుండా ఒకరిని ఏకంగా 11 పెళ్లిళ్లు చేసుకున్న ఓ ప్రబుద్దుడి ఉదంతం హైదరాబాద్ లో ఆసక్తి రేపుతోంది. ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకున్న అడపా శివశంకర్ బాబు అనే ఈ ప్రబుద్ధుడు.. పెళ్లి కూతుళ్ల వద్ద నుంచి అందినకాడికి డబ్బులు దండుకుని వదిలేసేవాడు. గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన ఈ అడపా శివశంకర్‌బాబు ప్రత్యేకించి రెండో పెళ్లి కోసం ఎదరుు చూసే మహిళలను టార్గెట్ చేసి బుట్టలో వేసుకునేవాడు.
అంతే కాదు.. ఇతని ద్వారా మోసపోయిన వాళ్లు.. కొండాపూర్‌లోనే పక్క పక్క వీధుల్లో ఉండటం మరో విశేషం. మోసపోయిన 11 మందిలో ఏడుగురు కొండాపూర్ వారే. అందులోనూ పక్క.. పక్క వీధుల్లోని వారే.. ఇప్పుడు లబోదిబో మంటున్నారు. అంతే కాదు.. ఇతగాడు.. ఏపీకి చెందిన ఓ మంత్రి బంధువునని చెప్పుకునేవాడట. ఇప్పుడు అతని భార్యలు పోలీస్ స్టేషన్‌కు ఎక్కారు.