ఉక్రెయిన్ పై రష్యా అరాచకం.. ఇంత దారుణమా?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్‌ దేశంపై రష్యా సేనలు యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాయి. వరుసగా ఒక నగరం తర్వాత మరో నగరంపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు దక్షిణంగా ఉన్న వినిత్సియా పట్టణంపై రష్యా  సేనలు ఫోకస్ చేశాయి. తాజాగా అక్కడ జరిపిన క్షిపణి దాడుల్లో 20 మంది చనిపోయారు. మరో 100 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో  ఓ చిన్నారి సైతం ఉన్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.

 ఓ కార్యాలయ భవనం జరిపిన క్షిపణి దాడులతో ఈ దారుణం జరిగింది. ఈ దాడిలో భవనంతో పాటుగా సమీపంలోని ఇళ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా క్షిపణి దాడుల్లో ఎగసిపడిన మంటలు వ్యాపించి సమీపంలో 50 కార్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. రష్యా కావాలనే జనావాసాలపై దాడులు చేస్తోందని జెలెన్‌ స్కీ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: