ఇవాళే నీట్ పరీక్ష.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి?
ఈ నీట్ పరీక్ష కు వచ్చే వారు ఆభరణాలు, బూట్లు, పొడవు చేతుల చొక్కాలు, పర్సు, చేతిగడియారాలు తీసుకురాకూడదు. వీటికి అనుమతి ఉండదు. రాత పరీక్షకు కేంద్రంలోనే పెన్ను కూడా ఇస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఈ నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా 543 నగరాల్లో జరుగుతుంది. అంతే కాదు.. విదేశాల్లోనూ 13 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి దాదాపు 60వేల మంది నీట్ రాస్తున్నారు.