అకౌంట్లలో కేసీఆర్‌ డబ్బులు.. మీకు వచ్చాయా?

Chakravarthi Kalyan
కేసీఆర్ సర్కారు రైతు బంధు పెట్టుబడి సాయం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఈ విడతలో ఇప్పటి వరకూ కోటి 47 లక్షల ఎకరాలకుపైగా  రైతుబంధు పథకం పెట్టుబడి సాయం విడుదల చేశారు. 64.95 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7372.56 కోట్లు పెట్టుబడి సాయం జమ చేశారు. రాష్ట్రంలో రైతుబంధు నిధుల పంపిణీ పూర్తి కావస్తోంది.

ఇదే సమయంలో రాష్ట్రంలో వరదలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతు బంధు సాయంపై వివరాలు అందించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. విపక్షాలది బురద రాజకీయం అని కొట్టిపారేస్తున్నారు. టీఆర్ఎస్  ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి వరద బాధితులకు సహాయం అందిస్తున్నారన్న నిరంజన్‌ రెడ్డి.. విపక్ష నేతలు పార్టీ కార్యాలయాల్లో మీడియా ముందు రాజకీయం చేస్తున్నారన్నారు. గోదావరికి 500 ఏళ్ల తర్వాత భారీ వరదలు వచ్చాయన్న నిరంజన్‌ రెడ్డి.. కాళేశ్వరం పంప్ హౌజ్‌ల నీటమునకపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: