సంచలనం: ఎట్టకేలకు ఈడీ ముందుకు సోనియా..?
సోనియా గాంధీ గత నెలలోనే ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ.. కరోనా కారణంగా సోనియా గాంధీ విచారణకు వెళ్లలేదు.
దీంతో సోనియాగాంధీకి తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో విచారణకు వెళ్లాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. గత నెలలో సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీని ఈడీ ఐదు రోజుల పాటు విచారించింది. మొత్తం 55 గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించింది. ఇక ఇప్పుడు సోనియా గాంధీ వంతు వచ్చింది. సోనియా గాంధీ విచారణ ఎన్నిరోజులు సాగుతుందో మరి.