నేడే రాష్ట్రపతి ఎన్నికల రిజల్ట్స్‌: ముర్ముదే పీఠం?

Chakravarthi Kalyan
ఇవాళ నేడు రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పార్లమెంటు భవనంలో ఉదయం 11 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి.మోదీ ఆధ్వర్యంలో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట ఎంపీల ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఒక్కో రాష్ట్ర ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.

ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో ఉన్నారు. అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా  పోటీలో ఉన్నారు. లెక్కింపు మొత్తం పూర్తయ్యాక తుది ఫలితం ప్రకటిస్తారు. ఈనెల 24తో ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్‌ పదవీకాలం ముగుస్తుంది. ఈనెల 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. తమ అభ్యర్థి ద్రౌపది ముర్ము అంచనాలను మించి మెజార్టీ సాధిస్తారని బీజేపీ ధీమాగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: