శాటిలైట్‌ చిత్రాల్లో వెలుగు చూసిన చైనా అరాచకం?

Chakravarthi Kalyan
మన పొరుగున ఉన్న చైనా ఎంత కంత్రీయో మనకు తెలుసు.. కానీ.. మన కంటే చాలా శక్తివంతమైన దేశం కావడం వల్ల జాగ్రత్తగా ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. అయితే మన భద్రత గురించి రాజీపడే ప్రసక్తే లేదని కేంద్రం చాలాసార్లు తేల్చి చెప్పింది. అయినా చైనా కుయుక్తులు సాగుతూనే ఉన్నాయి. తాజా మక్సర్ అనే ఓ సంస్థ బయటపెట్టిన ఉపగ్రహ చిత్రాల్లో చైనా అరాచకం ఒకటి వెలుగు చూసింది.


సిక్కిం సరిహద్దుల్లో ఇప్పుడు చైనా ఓ గ్రామాన్నే నిర్మించింది. అమోచూ ప్రాంతం వద్ద భారత్-చైనా-భూటాన్ కూడలికి దగ్గరలో చైనా ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. ఈ విషయం ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఈ ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే పాంగ్డా గ్రామం ఎంతగా నిర్మాణం చేశారో తెలుస్తుంది. పాంగ్డాకు దక్షిణాన కూడా.. చైనా మరికొన్ని నిర్మాణాలు చేపడుతోందని ఈ ఉపగ్రహల ద్వారా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: