బయటపడ్డ చైనా కుట్ర.. దేనికైనా రెడీ అంటున్న సైన్యం?
చైనా కుట్రలకు పాంగ్డా గ్రామం అద్భుతమైన ఉదాహరణ అని మాజీ సైన్యాధికారులు కూడా చెబుతున్నారు. సరిహద్దుల్లో గ్రామాలు నిర్మించి అక్కడ తమ ఉనికిని చాటుకోవాలని చైనా భావిస్తోందని వారు అంటున్నారు. అయితే సరిహద్దుల్లో చైనా ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొనేందుకు మేం సిద్ధం అని రక్షణ శాఖ వర్గాలు ప్రకటిస్తున్నాయి. భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే ఎలాంటి కార్యాక్రమాలనైనా ఎదుర్కొంటామంటున్నాయి. ఈ ప్రాంతంపై నిరంతరం నిఘా ఉంచినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.