మీ బాస్‌ డబ్బు కావాలి అంటే.. మీరు మోసపోయినట్టే?

Chakravarthi Kalyan
సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. రోజుకో కొత్త విధానంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.  ఆపదలో ఉన్నాం ఆదుకోండి అంటూ వాట్సప్‌, ఇతర సోషల్ మీడియా  ద్వారా... ప్రముఖుల పేర్లు, ఫొటోలతో మెసేజ్ లు పంపుతున్నారు.  సైబర్ నేరగాళ్లు ఆ వలలో చిక్కిన వారినుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ ఖాతాల్లో చాలామంది పెట్టే ఫొటోలతోనే నకిలీ అకౌంట్లు క్రియేట్‌ చేసి సైబర్ కేడీలు రెచ్చిపోతున్నారు.


పోలీసు అధికారులు, ప్రముఖులు, చివరకు న్యాయమూర్తుల పేర్లు, ఫోటోలతో నకిలీ ఖాతాలు, డీపీలు పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా న్యాయమూర్తుల  ఫొటోలతోనూ మోసాలకు పాల్పడ్డారు. ఇలాంటి కేసులు నమోదు చేసుకున్న సీఐడీ  సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ డీపీ ఖాతాలపై దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే నాకు అత్యవసరంగా డబ్బులు కావాలి... కొంచెం సర్దుబాటు చేస్తావా అని ఎవరైనా అడిగితే నేరుగా వాళ్లకు ఫోన్ చేసి నిర్ధరించుకోండి. తస్మాత్ జాగ్రత్త.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: