రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇప్పుడు ప్రపంచంలోనే కీలక వ్యక్తి.. అమెరికా వంటి అనేక దేశాలు వద్దు మొర్రో అంటూ ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించాడు.. యుద్ధం కొనసాగిస్తున్నాడు. అందుకే రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నాయి. అయితే.. ఇలాంటి సమయంలో.. ఇటీవల పుతిన్‌కు ఆనారోగ్యంగా ఉందని అనేక సార్లు వెస్ట్రన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పుతిన్‌కు క్యాన్సర్ అని.. దానికి చికిత్స పొందుతున్నారని ప్రచారం జరుగుతోంది. పుతిన్ మరో మూడేళ్లకు మించి బతక్క పోవచ్చని కూడా వార్తలు వచ్చాయి.
అయితే.. ఇలాంటి సమయంలో అమెరికా అత్యున్నత నిఘా సంస్థ సీఐఏ అధిపతి విలియమ్ బర్న్స్ కొలరాడోలో జరిగిన ఆస్పార్న్ సెక్యూర్టీ ఫోరంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. పుతిన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తేల్చి చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై చాలా పుకార్లు వచ్చినా.. నాకు తెలిసి పుతిన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పేశారు.