ఏపీకి గుడ్ న్యూస్.. ఆ రుణాలు రెడీ?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం చాలా చేస్తున్నాయని.. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు అన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే రైతుల తోటి వారితో కలిసి రైతు ఉత్పత్తి సంఘాలుగా మారాలని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు సూచించారు. అప్పుడే వారికి లాభాలు వస్తాయని స్పష్టం చేశారు. కొత్త సాంకేతికతతో సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని, పండించిన పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మటం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు వివరించారు.