బాప్‌రే.. ఒకే వ్యక్తికి మంకీపాక్స్, కరోనా?

Chakravarthi Kalyan
నిన్న మొన్నటి వరకూ కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు మంకీపాక్స్ ఆ పాత్ర పోషిస్తోంది. అయితే. ఒకే వ్యక్తికి అటు కరోనా.. ఇటు మంకీ పాక్స్ రెండూ వస్తే.. ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. అమెరికాలో కరోనా వైరస్‌తో బాధపడుతోన్న ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ సోకినట్టు నిర్థరణ అయ్యింది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న రెండు వైరస్‌లు ఒకేసారి ఒకే వ్యక్తికి సోకడం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇలా జరగడం ఇదే  తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు.


అమెరికాలోని కాలిఫోర్నియావాసి  జూన్‌ చివరి వారంలో కరోనా బారిన పడ్డాడు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. తలనొప్పితోనూ బాధపడుతోన్న ఆయనకు శరీరంపై దద్దుర్లు, చిన్నపాటి ఎరుపురంగు పొక్కులు కూడా వచ్చాయి. అనుమానించిన అతడు వెంటనే వైద్యులను సంప్రదించాడు. అతడిని పరీక్షించిన వైద్యులు అవి మంకీ పాక్స్‌ లక్షణాలుగా నిర్ణయించారు. ఈ కేసుకు సంబంధించిన కథనాలు అమెరికా మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: