సీఎంకు షాక్‌: బీజేపీకి టచ్‌లో 38 మంది ఎమ్మెల్యేలు?

Chakravarthi Kalyan
పశ్చిమ బెంగాల్‌లోఅధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏకంగా 21 మంది బీజేపీకి టచ్‌ లో ఉన్నారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. 38 మంది తృణముల్ MLAలు తమ పార్టీకి సన్నిహితంగా ఉన్నారని.. బీజేపీ నేత మిథున్‌ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అందులో 21 మంది వ్యక్తిగతంగా తనతో టచ్‌లో ఉన్నారని మిధున్‌ చక్రవర్తి అంటున్నారు.

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు.. పశ్చిమ బెంగాల్‌లోనూ జరగొచ్చని ఆయన అంటున్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలో ఉందన్న చక్రవర్తి... అతి త్వరలో మరిన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగురుతుందంటున్నారు.
అయితే.. మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలను టీఎంసీ నేతలు తప్పుబడుతున్నారు. తప్పుడు ప్రకటనలతో మిథున్‌ చక్రవర్తి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం  294 స్థానాలున్నాయి. అధికార టీఎంసీకి 216 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: