ఉక్రెయిన్: శాటిలైట్ చిత్రాలు బయటపెట్టిన రష్యా రహస్యం?
అయితే.. తాజా శాటిలైట్ చిత్రాలు రష్యా వైమానిక దళానికి భారీ స్థాయిలో ఎదురు దెబ్బ తగిలిన వాస్తవాన్ని కళ్లకు కట్టాయి. తాము 8 రష్యా యుద్ధ విమానాలు ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించిన విషయమే వాస్తవమని శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. తాజాగా న్యూయార్క్ టైమ్స్ సహా వివిధ పత్రికలు దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ప్రచురించాయి. దీంతో రష్యా అబద్దం చెబుతోందని.. కనీసం ఆరు నుంచి ఏడు యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయని నిపుణులు భావిస్తున్నారు.