ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులకు ఒక చక్కటి శుభవార్తని అందించడం జరిగింది. విద్యార్థుల కోసం జగన్ అనేక రకాల సౌకర్యం కలిపిస్తున్నారు.విద్యాశాఖపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఇక సమీక్ష సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని కూడా ఆయన నియమించారు.ఇక నుంచి అన్ని స్కూళ్లకు కూడా ఇంటర్నెట్ అనేది పెట్టనున్నారు.వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరి నాటికి కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇక 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబులను వెంటనే ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ప్రతి తరగతి గదిలో కూడా డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఇంకా అలాగే దశలవారీగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు.