జగన్ సొంతగడ్డపై పవన్ కల్యాణ్ పర్యటన?
ఈనెల 20న సిద్ధవటంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధిత కౌలు రైతులను పరామర్శించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చనున్నారు. వారికి జనసేన తరపున రూ. లక్ష రూపాయల చొప్పున పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం చేయనున్నారు. బాధిత రైతుల కుటుంబాల పరామర్శ తర్వాత.. సిద్ధవటంలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే వైసీపీకి వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ప్రకటించిన పవన్ కల్యాణ్.. జగన్ సొంత గడ్డపై ఏం విమర్శలు చేయబోతున్నారో?