సీక్రెట్‌: ట్రంప్‌ ఇండియా టూర్‌ ఖర్చెంతో తెలుసా?

Chakravarthi Kalyan
రెండేళ్ల క్రితం ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఆయన ఇండియా పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా పెట్టిన ఖర్చులు ఇప్పుడు వెలుగులోకి వచ్చాచయి. కేంద్రం తాజాగా ఆ వివారలు వెల్లడించింది. సమాచార హక్కు చట్టం ద్వారా మిషల్‌ భథేనా అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు  కేంద్ర విదేశాంగశాఖ సమాధానమిచ్చింది.

ట్రంప్‌ మొత్తం ఇండియాలో 36 గంటలు పర్యటించారు. ఈ పర్యటనలో వసతి, భోజనం, లాజిస్టిక్స్‌ వంటి విషయాల కోసం 38 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు కేంద్రం తెలిపింది. 2020 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్‌నర్‌ ఇండియాకు వచ్చారు. ట్రంప్ ఫ్యామిలీ దిల్లీ, ఆగ్రా, అహ్మదాబాద్‌లలో పర్యటించారు. ట్రంప్‌ పర్యటనలో పెట్టిన మెుత్తం ఖర్చుల వివరాల కోసం ఆర్టీఐ కింద కేంద్ర విదేశాంగశాఖకు దరఖాస్తు చేసుకోగా ఈ వివరాలు బయటకొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: