జగన్‌ బటన్‌ నొక్కుతున్నా.. ఆత్మహత్యలెందుకు?

Chakravarthi Kalyan
ఏపీలో అనేక సంక్షేమ కార్యక్రమాలు.. నగదు బదిలీ పథకాలు అమలవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రతిసారి ఘనంగా చెప్పుకుంటోంది. అయితే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే... రాష్ట్రంలో ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తెలిపారు. చివరకు సీఎం నియోజకవర్గం పులివెందులలో కూడా 40 మందికి పైగానే ఆత్మహత్య చేసుకున్నట్లు రికార్డులు ఉన్నాయన్నారు.


కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కడప జిల్లాలో పర్యటిస్తారు. సిద్ధవటంలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని పవన్ కల్యాణ్ అందజేస్తారు. అక్కడే బహిరంగ సభలో ప్రసింగిస్తారు. జన సైనికులు పర్యటన విజయవంతం చేయాలని మనోహర్ కోరారు. గత ఏడాది రాజంపేట, నందలూరులో వరదలు వస్తే జన సైనికులే ముందుగా అక్కడికి వెళ్లి బాధితులను పలకరించారని మనోహర్ గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: