సీక్రెట్‌ ఔట్‌: జయలలిత మరణంపై రిపోర్ట్‌ వచ్చేసింది?

Chakravarthi Kalyan
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపాలూ లేవని ఎయిమ్స్‌ వైద్యబృందం ఆర్ముగస్వామి కమిషన్‌కు ఆదివారం నివేదిక సమర్పించింది. జయలలిత 2016లో అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె మరణంపై అనుమానం ఉందని ఓ పన్నీర్‌సెల్వం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్రాంత న్యాయమూర్తి ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటుచేశారు. ఈ కమిషన్‌ జయలలిత మృతి విషయంలో పలువురిని విచారించింది. ఈ నేపథ్యంలో కమిషన్‌కు ఎయిమ్స్‌ వైద్యబృందం మూడు పేజీల నివేదిక సమర్పించింది.

అపోలో ఆస్పత్రిలో చేరకముందే జయలలితకు థైరాయిడ్‌, బీపీ, షుగర్‌ మొదలైన పలు అనారోగ్య సమస్యలున్నాయని, ఆస్పత్రిలో చికిత్స సమయంలో ఆమె ద్రాక్ష, కేక్‌, స్వీట్లు తినడంతో సెప్టెంబరు 28న ఆరోగ్యం క్షీణించి ఊపిరితిత్తుల సమస్య తలెత్తినట్లు తెలిపింది. దీంతో అక్టోబరు 7వ తేదీ ట్రాకియోస్టమీ చికిత్స ప్రారంభించారని, అక్టోబరు 14 నుంచి లండన్‌ వైద్యుడు రిచర్డ్‌ బిలే, అపోలో ప్రత్యేక వైద్యులు, ఎయిమ్స్‌ వైద్యులు చికిత్స అందించారని పేర్కొంది. డిసెంబరు 3వ తేదీన ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి, 4వ తేదీ శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని, ఎక్మో ఏర్పాటుచేసి 24 గంటలు పర్యవేక్షించారని వెల్లడించింది. 5వ తేదీ మెదడు, గుండె పనిచేయలేదని వైద్యులు నిర్ధారించినట్లు వివరించింది. ఆమెకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపాలు లేవని నివేదికలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: