సినీ పరిశ్రమకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్‌ 1 నుంచే?

Chakravarthi Kalyan
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో స్తబ్దత నెలకొంది. నిర్మాతలు షూటింగులు నిలిపేయడంతో కార్మికులకు ఉపాధి కరవైంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి సినిమా షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. 23 రోజులుగా నిర్మాతలందరం అన్ని శాఖల్లోని సమస్యలపై చర్చిస్తున్నామన్న సి.కళ్యాణ్ .. ఇప్పటికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని.. మరో 2 రోజుల్లో మిగతా నిర్ణయాలు చెబుతామని అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి సినిమా షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలిపారు.

అత్యవసరమైతే ఆగస్టు 25 నుంచి ఛాంబర్ అనుమతితో షూటింగ్స్ చేసుకోవచ్చని సి.కళ్యాణ్  అన్నారు. దీనిపై దిల్ రాజు స్పందిస్తూ..  సినీ పరిశ్రమలోని సమస్యలపై 23 రోజులుగా రోజుకు ఐదారు గంటలు మాట్లాడుకున్నామని.. ఆగస్టు 30న మా తుది నిర్ణయాలు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెల్లడిస్తామని తెలిపారు. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లకు వీపీఎఫ్ సమస్య పరిష్కారమైందని.. తెలుగు రాష్ట్రాల్లో 1800 థియేటర్లున్నాయని.. సెప్టెంబర్ 2 నుంచి వీఫీఎఫ్ ఛార్జీలు వసూలు చేయడం లేదని.. టికెట్ ధరలు, తినుబండారాలు అందుబాటు ధరల్లోనే ఉంటాయని దిల్ రాజు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: