ప్రాంతీయ పార్టీల్లో దేశంలోనే వైసీపీ నెంబర్ వన్?
2020-21 ఆర్థిక సంవత్సరంలో తనకు 179 కోట్లు గుప్త విరాళాలు వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇదే కాలానికి గుర్తు తెలియని మూలాల నుంచి రూ.100 కోట్లు విరాళంగా వచ్చినట్లు బీజేపీ తెలిపిందని ఏడీఆర్ సంస్థ చెబుతోంది. ఇక ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ టాప్ లో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ రూ.96.25 కోట్ల విరాళాలతో అగ్రస్థానంలో ఉందని ఏడీఆర్ తెలిపింది. ఆ తర్వాత స్థానంలో డీఎంకే రూ.80.02 కోట్లుతో, బీజేడీ రూ.67 కోట్లుతో, ఎంఎన్ఎస్ రూ.5.77 కోట్లతో, ఆప్ రూ.5.4 కోట్లతో తర్వాత స్థానాల్లో నిలిచినట్టు ఏడీఆర్ సంస్థ వివరించింది.