రవితేజ 'రాజా ద్రి గ్రేట్'ను మించిన ఈ రాజయ్య గ్రేట్?
ఏదో సినిమా కదా.. అలా చూపిస్తారు కానీ.. నిజంగా అలా ఉంటారా.. కళ్లు లేకపోయినా అంత సులభంగా పనులు చేసుకుంటారా.. అని ఆశ్చర్యపోతాం.. అయితే.. అచ్చం రవితేజ సినిమాలో అంధ హీరో తరహాలోనే ఓ 62 ఏళ్ల వృద్ధుడు.. అన్ని పనులు చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపురానికి చెందిన రాజయ్య.. చిన్నప్పుడే కంటిచూపు లేకపోయినా.. ఏ సహాయం లేకుండానే ఊరంతా తిరగుతారు. నీటి బావుల్లోకి దిగి పాడైన మోటార్లను బయటికి తీస్తాడు. వాటికి మరమ్మతులు కూడా చేస్తాడు. తన వంట తానే చేసుకుంటాడు. గ్యాస్ పొయ్యి మీద వంట చేసుకుంటాడు. గ్రేట్ కదా.