బెజవాడ పోలీసుల్లో ఒకటో తారీఖు టెన్షన్?
ఇప్పటికే ఈ కార్యక్రమాలకు హాజరు కావద్దంటూ ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులు ఇస్తున్నారు. ఇలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 3న కూడా ఉద్యోగులు విజయవాడ వచ్చి రచ్చ రచ్చ చేశారు. బీఆర్టీఎస్ రోడ్డులో ఉద్యోగులు ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా.. ఆ కార్యక్రమానికి జిల్లాల నుంచి విజయవాడకు ఉద్యోగులు భారీగా వచ్చారు. కార్యక్రమం గ్రాండ్ సక్సస్ అయ్యింది. దీంతో సీఎం నుంచి పోలీసు పెద్దలకు అక్షింతలు పడ్డాయి. మళ్లీ ఆ సీన్ రిపీట్ కాకూడదన్న టెన్షన్ పోలీసుల్లో కనిపిస్తోంది.