గ్రేట్ మదర్: రెండు సార్లు జన్మనిచ్చిన అమ్మ?
అసలేమైందంటే.. సుధీర్ పుట్టుకతోనే కాలేయ వ్యాధి సోకింది. ఆరువారాలకు మించి బతకడని వైద్యులు చెప్పారు. మణిపాల్ వైద్యులను సంప్రదించారు. కాలేయ మార్పిడితో బాలుడికి వచ్చిన వ్యాధి తగ్గుతోందని వైద్యులు చెప్పారు. బాలుడికి కాలేయం ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారి బంధువులది సెట్ కాలేదు. బాలుడికి తన తల్లి కాలేయం సరిపోయినా తల్లి కాలేయానికి జీర్ణాశయ సిర అతుక్కోవడంతో వైద్యులు తీవ్రంగా శ్రమించి ఆపరేషన్ చేశారు. 18 గంటలపాటు శస్త్ర చికిత్స చేసి హేమ నుంచి కాలేయం ముక్క తీసి బాలుడికి అమర్చారు. కాలేయ మార్పిడి ద్వారా తల్లి మరోసారి తన కుమారుడికి జన్మనిచ్చిందని వైద్యులు అన్నారు.