తెలంగాణకు క్యూకడుతున్న కేంద్ర మంత్రులు?

Chakravarthi Kalyan
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. మునుగోడు ఉపఎన్నిక.. మళ్లీ ఏడాదిలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెంచింది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు తరచూ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఇంకొందరు రాబోతున్నారు. అలా వచ్చే వారి జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కూడా ఉన్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు పర్యటిస్తున్నారు. 



అలాగే కేంద్ర భారీ పరిశ్రమలు శాఖ మంత్రి మహేంద్ర నాత్ పాండే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో సెప్టెంబర్ 3, 4 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను పేద బడుగు బలహీన వర్గాలకు అందుతున్న విధానం అమలు జరుగుతున్న పద్ధతులను కేంద్ర మంత్రులు తెలుసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వినియోగం గురించి తెలుసుకుంటారు. పార్టీ కార్యకర్తలతో నాయకులతో వివిధ సమావేశాల్లో కేంద్ర మంత్రులు పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: