మోదీ చర్యలతో.. గుజరాత్‌లో ఆప్ పుంజుకుంటుందా?
బీజేపీ సభ్యులు డిప్యూటీ స్పీకర్ తో వాగ్వాదానికి దిగడంతో వారిని మార్షల్స్ బయటకు పంపేశారు.
మిగిలిన బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న కమలంఆపరేషన్ లోటస్ కార్యక్రమం విఫలమైందని కేజ్రీవాల్ అసెంబ్లీలో ఆరోపించారు. జాతీయ స్థాయిలో రెండే పార్టీలు ఉన్నాయన్న కేజ్రీవాల్ నిజాయతీ పార్టీ ఒకటి, అత్యంత అవినీతిపార్టీ మరొకటి అంటూ బీజేపీపై విమర్శలు చేశారు. ఉపముఖ్యమంత్రి సిసోదియా ఇంటిపై సీబీఐ సోదాలతో గుజరాత్ లో ఆమ్ ఆద్మీకి మరో 4శాతం ఓటింగ్ పెరిగిందని కేజ్రీవాల్ అన్నారు. సిసోదియాను అరెస్ట్ చేస్తే అది మరో 6శాతం పెరుగుతుందన్నారు.