తెలంగాణ: పుట్టే ప్రతి పిల్లాడిపై రూ. లక్షా 25 వేల అప్పు?
బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడం లేదని.. బడ్జెట్ లో చాల అప్పులు చూపించడం లేదని.. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రంకు ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై 1 .25 లక్షల అప్పు ఉందన్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్.. ఎఫ్ఆర్బియం లిమిట్ ను తెలంగాణ దాటిపోతోందన్నారు. దేశం మొత్తం తిరిగే ముందు మీ రాష్ట్రానికి మీరు సమాధానం చెప్పండని కేసీఆర్‌కు సవాల్ విసిరిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్.. లిక్కర్ స్కామ్ పై ఎవరి పై ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలన్నారు.