ఆ రాష్ట్రాల్లో కేసీఆర్ ఫోటో పెడతారా?
దీంతో టీఆర్ఎస్ మంత్రులు కూడా కౌంటర్లు వేస్తున్నారు. మరి తెలంగాణ కేంద్రానికి 3.65లక్షల కోట్ల పన్నులు రూపంలో చెల్లించిందని.. కానీ.. కేంద్రం నుంచి 1.6 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇచ్చారని తెలంగాణ మంత్రులు అంటున్నారు. బీహార్, యూపీ, గుజరాత్ లకు కనీసం లక్ష కోట్లు తెలంగాణ డబ్బు వినియోగించారని.. ఉత్తరాది రాష్ట్రాలకు తెలంగాణ సొమ్ము వాడారని... మరి అక్కడ కేసీఆర్ ఫోటో పెట్టగలరా అని తెలంగాణ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. నిర్మలా సీతారామన్ మాట్లాడిన అన్నీ అబద్ధాలే చెబుతున్నారని.. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ ల్లో ఒక్క రూపాయి కేంద్రం సొమ్ము లేదని.. ఫసల్ బీమా యోజన గుజరాత్ లోనే అమలు చేయడం లేదని తెలంగాణ మంత్రులు అంటున్నారు.