
ఇక వాళ్లకే టిక్కెట్లు.. తేల్చేసిన చంద్రబాబు?
పార్టీ.. రాజకీయ పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా చెయ్యాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విజన్ ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని... విద్వేషాలు ఉంటే కావని చంద్రబాబు స్పష్టం చేశారు. కొందరు పోరాటాలు చేయకుండా.. కేవలం పత్రికా ప్రకటనలతోనే నాయకులు గా చెలామణీ అవుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి వారిని ఇక ఉపేక్షించబోమని.. ఎంతటి వారైనా క్షేత్ర స్థాయిలో పని చేస్తేనే టికెట్లు వస్తాయని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు.