నెల్లూరు జిల్లాకు భారీ పరిశ్రమ..ఏకంగా 40 వేల కోట్లు?
ఈ పరిశ్రమ వల్ల 11,500 మందికి ప్రత్యక్షంగా, 11 వేలమందికి పరోక్షంగా ఉద్యోగాలు లభించబోతున్నాయి. నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ, దీంతోపాటు 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఈ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే పోర్టుల కారణంగా నెల్లూరు జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు ఈ పరిశ్రమలతో మరింత మందికి ఉపాధి లభించనుంది.