బంపర్‌ఆఫర్‌: రూ. 500 కే గ్యాస్ సిలిండర్‌?

Chakravarthi Kalyan
గ్యాస్ సిలిండర్ ఇప్పుడు చాలామందికి గుది బండగా మారింది. ఇప్పుడు ఏకంగా దీని రేటు వెయ్యి రూపాయలు దాటింది. గతంలో కేంద్రం సబ్సిడీ ఇచ్చేది. క్రమంగా ఆ సబ్సిడీని ఎత్తేసి.. నామామాత్రంగా మార్చేసింది. ఇప్పుడు సబ్సిడీ 20 రూపాయలు నుంచి 40 రూపాయల వరకూ వస్తోంది. ఒకప్పుడు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇప్పుడు వెయ్యి దాటింది. అయితే.. ఇప్పుడు కూడా సిలిండర్ రూ. 500 కే ఇస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ.
అహ్మదాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిలిండర్ అస్త్రం ప్రయోగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. గుజరాత్‌లో ఎల్పీజీ సిలిండర్‌ను రూ.500కే అందిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. అంతే కాదు.. రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తామని  కూడా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఇంకా రూ.3 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు. బాలికలకు ఉచితంగా  విద్య అందిస్తామని.. ఇళ్లకు కూడా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

GAS

సంబంధిత వార్తలు: