ఛీఛీ.. ఆ విషయంలోనూ విష ప్రచారమా?
పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్ధారించారని కురసాల కన్నబాబు తెలిపారు. కొంతమంది విష వాయువు అంటూ రూమర్స్ ప్రచారం చేస్తున్నారన్న కన్నబాబు.. అదంతా తప్పుడు ప్రచారమని తేలిందని తెలిపారు. 419 మంది విద్యార్థులున్న పాఠశాలలో కేవలం రెండు తరగతుల్లో 18 మంది మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. కారణం విష వాయువులు కాదని.. కారణం ఏంటనేది కమిటీ నిర్ధారిస్తుందని ఆయన తెలిపారు.