ఇంజినీరింగ్లో ఆ సీట్లకే ఫుల్ డిమాండ్?
అదే సమయంలో సివిల్, మెకానికల్ బ్రాంచ్లు మాత్రం మూడో వంతు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. తెలంగాణ ఎంసెట్ తొలి విడత సీట్ల కేటాయింపులో కనిపిస్తున్న సీన్ ఇది. ముందుగా ఊహించినట్లే కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో బీటెక్ సీట్లు చాలా వేగంగా పూర్తయ్యాయి. ఈ సీట్లలోని 17 బ్రాంచీల్లో 98.49 శాతం సీట్లు నిండినట్టు తెలుస్తోంది. ఇక వీటి తర్వాత డిమాండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీలకు ఉంది. ఈ బ్రాంచీల్లో 80.96 శాతం సీట్లు నిండాయి.