దమ్ముంటే: చంద్రబాబుకు కొడాలి నాని సవాల్?
చంద్రబాబు ఏడవొద్దని చెప్పాలని.. తాము అన్నీ చర్చిస్తామని కొడాలి నాని అంటున్నారు. మీకు సభకు వచ్చే ధైర్యం లేదని... ఎంతసేపూ వాకౌట్ చేసి, బయట మాట్లాడడం తప్ప.. దిక్కు మాలిన ఎల్లో మీడియాలో చర్చలు పెట్టడం తప్ప.. ఇంకేమీ చేతకాదని కొడాలి నాని మండిపడ్డారు. జగన్ పనై పోయిందని, మళ్లీ తాను సీఎం అవుతానని చంద్రబాబు అంటున్నారన్న కొడాలి నాని ఏమిటి ఆయన అయ్యేది అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు కనీసం ఎమ్మెల్యే కూడా కాడని.. ఓడిపోయిన లోకేష్ కూడా జగన్ పై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు కొడాలి నాని.