డైరెక్టుగా ఆటంబాంబే.. అమెరికాకు ఉత్తర కొరియా వార్నింగ్?

Chakravarthi Kalyan
ఉత్తర కొరియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ దేశమైనా తమ నాయకత్వాన్ని కూల్చడానికి  ప్రయత్నిస్తే ఇక వారిపై నేరుగా ఆటంబాబులు వేస్తుందట. ఈ విధంగా నేరుగా తన దేశ మిలిటరీకి అధికారం ఇస్తూ ఉత్తర కొరియా కొత్త చట్టం రూపొందించింది. దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ కొత్త చట్టం ప్రకారం.. ఏదేశమైనా తమ నాయకత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిస్తే.. ఇక ఆ దేశంపై నేరుగా ఆటంబాబు వేసే అధికారం మిలటరీ చేతికి వచ్చేసింది.
ఈ చట్టం ఆమోదం సందర్బంగా ప్రసంగించిన ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్.. తమ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను వదులుకోదని తేల్చి చెప్పేశారు. ఉత్తర కొరియాను ఆయుధాలు లేని దేశంగా మార్చేందుకు అమెరికా కుట్ర పన్నుతోందన్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా కుట్ర చేస్తోందని కూడా కిమ్ ఆరోపించారు. అమెరికాకు బదులివ్వాలంటే అణ్వాయుధాలే సరైనవని కిమ్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KIM

సంబంధిత వార్తలు: