అదిరింది.. ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం?

Chakravarthi Kalyan
భారత సైన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ భారత సైన్యంలో ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్ మూడు వేరు వేరు విభాగాలుగా ఉండేవి. ఇవి మూడు వేరు వేరు విభాగాలుగానే ఉంటున్నాయి. దీని వ్యవస్థలు దానికే ఉంటుండేవి.. కానీ.. ఇప్పుడు రక్షణ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. త్రివిధ దళాల ఉమ్మడి నిర్వహణ దిశగా ప్రయాణిస్తాయి. దీని ద్వారా ఒక సర్వీసుల్లోని లాజిస్టిక్ వనరులను మరొక సర్వీసుల్లో ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

దిల్లీలో ఆర్మీ లాజిస్టిక్స్‌పై నిర్వహించిన సెమినార్‌లో త్రివిధ దళాల అధిపతులతోపాటు, నీతి ఆయోగ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈ దిశగా చర్చలు సాగించారు. ఈ మూడు వ్యవస్థలతో పాటు రైల్వే రంగంలోనూ భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన దేశంలో  9వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు గత ఏడేళ్లలో రెట్టింపు అయ్యాయి. పౌర, సైనిక వర్గాల మధ్య సహకారానికి రైల్వే కూడా తోడ్పడుతోంది. వివిధ రంగాల ప్రతినిధులు పరస్పరం నిబద్ధతతో ఈ అమృత్‌ కాలంలో భారత్‌ను లక్ష్యం వైపు తీసుకెళ్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: